1996 నుండి · 30 సంవత్సరాల అనుభవం · వేలాదిగా సంతృప్తి చెందిన కస్టమర్లు
పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, పాఠ్య పుస్తకాలు, పెళ్లి పత్రికలు, విజిటింగ్ కార్డులు, క్యాలెండర్లు, బైండింగ్, లామినేషన్ మరియు డిజైన్ — ఆఫ్‌సెట్ మరియు డిజిటల్ ముద్రణలో సంపూర్ణ సేవలు. ఆరు భాషల్లో ముద్రణ.
మేము సమయ పాలనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాము. చెప్పిన సమయానికి డెలివరీ — ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆలస్యం జరగలేదు.
అనుదాత్త, ఉదాత్త స్వరాలతో — స్వర యుక్తంగా — అనేక వేద మంత్రాల పుస్తకాలను DTP చేసి ముద్రించిన అనుభవము గలిగిన సంస్థ మా ప్రెస్. స్వర చిహ్నాలు సరిగ్గా, పొరపాట్లు లేకుండా ముద్రించడం మా ప్రత్యేకత.
1996 సంవత్సరంలో, పుష్పగిరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యా నృసింహ భారతి స్వామీజీ వారి చేతుల మీదుగా మా ప్రెస్ ప్రారంభమైంది. అప్పటి నుండి నాణ్యమైన ముద్రణ, కొత్త సాంకేతికతను స్వీకరించడం, మరియు కస్టమర్ల సంతృప్తికి ప్రాధాన్యం ఇవ్వడం — ఇవే మా బలాలు.
రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా, భారతదేశం అంతటా మరియు అమెరికా, కెనడా వంటి విదేశాల్లో కూడా వేలాదిగా సంతృప్తి చెందిన కస్టమర్లు మమ్మల్ని నమ్మి తమ గ్రంథాలను ముద్రించుకున్నారు.
ప్రింట్ ఆన్ డిమాండ్: ఇప్పుడు మేము కనీసం 50 కాపీల నుండి పుస్తకాల ముద్రణ చేస్తాము — సరసమైన ధరలో, నాణ్యతలో రాజీ లేకుండా.
మా ప్రెస్, పుష్పగిరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యా నృసింహ భారతి స్వామీజీ వారి చేతుల మీదుగా ప్రారంభమైంది. హంపి విజయనగరం శ్రీ విద్యారణ్య భారతి తీర్థ స్వామీజీ వారి దివ్య పాదుకా దర్శనం మా ప్రెస్‌కు లభించింది — సంపూర్ణ కన్నడ మహాభారతం ముద్రణ సందర్భంగా. మొదటి అడుగుగా, శివ మహా పురాణం (తెలుగు, 900 పేజీలు) మరియు తులసీదాస్ రామచరిత మానస్ — సంస్కృతం, అవధి, తెలుగు మూడు భాషల్లో (1,600 పేజీలు) — శివుని దివ్య కృపతో విజయవంతంగా పూర్తి చేశాము.
భారతదేశవ్యాప్తంగా కస్టమర్లకు నాణ్యమైన ముద్రణ సేవలను అందిస్తూ, నమ్మకమైన సంస్థగా గుర్తింపు పొందడం మా సంకల్పము. సృజనాత్మకత, ఆధునిక సాంకేతికత, నాణ్యతతో ప్రతి ఆలోచనను అద్భుతమైన ముద్రణ రూపంగా తీర్చిదిద్దడం మా లక్ష్యం.
ఉత్తమ పని పద్ధతులు, నైపుణ్యం, ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన ముద్రణ ఉత్పత్తులు మరియు సేవలను అందించడం మా లక్ష్యం. ప్రతి పనిలో నిజాయితీ, నిబద్ధత, సమయపాలనను పాటిస్తూ కస్టమర్ల సంతృప్తికి ప్రాధాన్యతనిస్తాము.
ప్రతి పనిలో ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తాము. మా అనుభవజ్ఞులైన సిబ్బంది ప్రతి పనిని బాధ్యతగా నిర్వహిస్తూ, కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా ఉత్తమ ఫలితాలను అందిస్తారు.
సమయానికి, నిర్ణయించిన బడ్జెట్‌లో నాణ్యమైన పనిని అందించడం మా నిబద్ధత. సమయపాలన, బాధ్యతాయుతమైన సేవల ద్వారా కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము.
మారుతున్న ముద్రణ రంగానికి అనుగుణంగా ఆధునిక యంత్రాలు, సాఫ్ట్‌వేర్, సాంకేతికతను వినియోగిస్తూ కొత్త ఆలోచనలను ఆచరణలో పెడతాము. మెరుగైన నాణ్యత, సృజనాత్మకత, విలువైన సేవలతో కస్టమర్లకు ఉత్తమ పరిష్కారాలను అందించడానికి నిరంతరం కృషి చేస్తాము.
దీప్తి టెక్నికలర్ ప్రింటర్స్ పొందిన ఇన్ని అవార్డులు, రివార్డులు, పురస్కారాలు, ప్రశంసలు — వాటి వెనుక ఉన్న ముఖ్య భాగస్వామి శ్రీమతి కె. రాజేశ్వరి గారు. ప్రెస్ ఆర్థికంగా మరియు ఆహ్లాదంగా ఎదగడంలో ఆమె పాత్ర అమోఘం.
తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, మరాఠీ — ఐదు భాషలలో ఏ చేతివ్రాతనైనా అలవోకగా అర్థం చేసుకొని, కంప్యూటర్ కీబోర్డుపై శివతాండవం చేసే చేతి వేళ్లతో, అన్ని భాషలను సమానమైన వేగంతో టైపు చేసి, అనేక గ్రంథాలను ముద్రణకు సిద్ధం చేశారు.
గూగుల్ ఉపయోగించని రోజులలో transliteration చేయడం — అది ఒక వరమే. "కార్యేషు మంత్రీ" అనే శ్లోకానికి నిదర్శనంగా, ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చి, ప్రెస్‌ను ముందుకు నడిపించారు.


















Successfully printed the Tulasidas Ramcharitmanas in three languages — Sanskrit, Awadi and Telugu — comprising 1,600 pages.
Grand publication of the Shiva Maha Puranam in Telugu, spanning 900 pages — completed as the first step.
Printed the complete Kannada edition of the Mahabharata. Blessed by the divine visit of His Holiness Sri Vidyaranya Bharathi Theertha Swamiji of Hampi Vijayanagaram on that occasion.
The only press to print the complete Sri Viswanatha Satyanarayana gari Sahityamu.
Successfully designed and printed the Telugu Matlata Antarjateeya Potile — the total work received appreciation from the USA.
Received appreciation from Chaganti garu for printing a book without a single mistake.
శైవమహాపీఠ మాసపత్రిక రజతోత్సవము సందర్భములో 25 సంవత్సముల నిరాఘాటమైన సేవకు పీఠాధిపతి శ్రీ అత్తలూరి మృత్యంజయ శర్మగారి చేతులమీదుగా సన్మానం.

తెలంగాణా గవర్నర్ స్వయముగా నిర్వహంచే రాజ్‌భవన్ స్కూల్ ద్వారా మేము డిజైన్ చేసి ముద్రించిన మల్టికలర్ సంచిక విడుదల సందర్భములో గవర్నర్‌ను తొలిసారి కలిసి, రాజ్‌భవన్‌లో అడుగిడిన సందర్భము.

మేము ముద్రించిన పుస్తకాలను చూసి, చదివి, ముందుమాటలు వ్రాసిన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక పుస్తకావిష్కరణ సభలో “తప్పులు లేని పుస్తకాలను చూస్తున్నాను” అని DTP చేసిన రాజేశ్వరిని, ముద్రించిన రామకృష్ణ శాస్త్రిలను సన్మానించిన సందర్భము.

సుమారు 50కి పైగా ఆధ్యాత్మిక పుస్తకాలను మా చే ముద్రింపజేసిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచురణకర్త శ్రీ సీతారామదాసు గారు “సర్వం శివమయం” అనే పుస్తకావిష్కరణ సభలో చిరు సన్మానం.

సాయి సంగీత అకాడమీ వారి సంగీత, సాహిత్య సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న సందర్భము, దానికి గుర్తింపుగా ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య గారి చేతుల మీదుగా సన్మానం.


మా ప్రెస్‌ను ప్రారంభించి మమ్ములను ఆశీర్వదించిన పుష్పగిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యానృసింహ భారతీ స్వామివారు, స్వయముగా మా నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని మమ్ములను ఆశీర్వదించుచున్న సందర్భము.


శైవమత ప్రబోధిని ప్రధాన సంపాదకులు శ్రీ ముదిగండ చంద్రశేఖర్ గారి చేతులమీదుగా “అక్షర శిల్పి”, “సృజనశీలి” కౌండిన్య శాస్త్రి అని వారి పుస్తకావిష్కరణ సభలో సన్మానం.

హైదరాబాద్, చిక్కడపల్లి ఆంజనేయస్వామి దేవాలయం ధర్మకర్తగా పనిచేసినందుకు గాను గుర్తింపుగా ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ కార్యనిర్వహణాధికారి గారితో సన్మానం.

అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి ఉత్సవాలలో చురుకుగా పాల్గొని సేవ చేసినందుకు గుర్తింపుగా శ్రీ సుబ్బరామిరెడ్డి గారు, శ్రీ రోశయ్యగారు అప్పటి గవర్నర్ చేతులమీదుగా చిరు సన్మానం.

ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానములో వేదాశీర్వచనము, కుటుంబ సభ్యులతో.

శ్రీ పి.వి. మనోహరరావు గారు వారి 92వ జన్మదినము రోజున, “ఆనాటి గేయాలు – నేటి ధ్యేయాలు” అనే పుస్తకాన్ని అందంగా ముద్రించి ఇచ్చిన సందర్భముగా ఆ దంపతులచే మా దంపతులకు చిరు సత్కారము.

“శాస్త్రి గారు, మీ పనితనానికి, శ్రద్ధకు అక్కడ పొగడని వారు లేరు!” Charlotte Hilton నిండా మన banners, cutouts, decorations! — USA SiliconAndhra, Telugu Matlata Director Sri Goutham గారి మాటలు.... గత దశాబ్దకాలంగా వారితో పనులతో అవినాభావ సంబంధం.



పుస్తకం, పత్రిక, విజిటింగ్ కార్డు, బిల్ బుక్, క్యాలెండర్, స్టిక్కర్, బ్యానర్, లామినేషన్, బైండింగ్, డిజైన్ — ఏ పనికైనా మాకు చెప్పండి. పరిమాణం (సైజు), పేజీలు, కాపీల సంఖ్య, కాగితం రకం తెలిపితే వెంటనే ధర చెబుతాము.
మేము ముద్రించిన పుస్తకాలను, రచయితల అనుమతితో, ఇక్కడే ఆన్‌లైన్‌లో అమ్మే సదుపాయం త్వరలో తీసుకొస్తాము — WhatsApp ద్వారా ఆర్డర్ చేసే విధానంతో.
ప్రతి అక్షరాన్నీ ఓ తుమ్మి పూవుగా
ప్రతి పదాన్నీ ఓ పత్రిదళంలా
ప్రతి వాక్యాన్ని ఓ గంగా ప్రవాహంగా
ప్రతి వ్యాసాన్ని ఓ పంచామృతంగా భావించి,
తొలి నాళ్ళ నుండీ ఈ రోజు దాకా సేవ చేసే మహదావకాశాన్ని కల్పించిన — కల్పిస్తున్న కస్టమర్లందరికీ, మా ఈ దీప్తి ప్రింటర్స్ కుటుంబం ధన్యవాదాలెలా చెల్లించగలం — “శరణులు” తప్ప.
మీ సేవకై మా వ్యాప్తి — శివానుగ్రహ “దీప్తి”